- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MS Dhoni : ‘ది గోట్’ మూవీలో మహేంద్రసింగ్ ధోని.. ఫ్యాన్స్ విజిల్స్, అరుపులతో దద్దరిల్లుపోతున్న థియేటర్లు!
దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ విజయ్ ( Vijay ) నటించిన మూవీ ది గోట్ (గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ మూవీ వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కింది. మీనాక్షి చౌదరి, మాళవిక శర్మలు కథానాయికలుగా నటించారు. యువన్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ విడుదలకు మంచి హైప్ క్రియోట్ చేసింది. ఈ మూవీలో ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ ముఖ్య పాత్రలను పోషించారు. భారీ అంచనాలతో నేడు వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ముందుకొచ్చింది.
ఇప్పటికే పలు చోట్ల షోలు పడ్డాయి. ఎక్కడ చూసిన మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ మూవీలో హీరోలు అజిత్, శివకార్తీకేయన్ లతో పాటు ఓ సీన్‌లో ఎంఎస్ ధోని ( Dhoni ) కూడా కనిపించి అందర్ని షాక్ కు గురి చేసాడు. ధోని కనిపించిన ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది బాగా వైరల్ అవుతుంది.
రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ లో ధోని ఎలా ఆడాడో మనందరికీ తెలిసిందే. ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ధోని పిచ్ లోకి వెలుతుండగా.. పైకి చూస్తాడు. అప్పుడే విజయ్ స్టేడియం పైన బైక్ రైడ్ చేస్తూ ఉంటాడు. ఈ సీన్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. వారి అభిమాన క్రికెటర్ స్క్రీన్ మీద కనిపించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.