దగ్గరుండి మరీ కూతురిని రేప్ చేయించిన తండ్రి.. ఓటీటీలో అదరగొడుతున్న ఎమోషనల్ ఫిల్మ్.. క్లైమాక్స్ లో కన్నీళ్లు ఆగవు..

by Sujitha Rachapalli |
దగ్గరుండి మరీ కూతురిని రేప్ చేయించిన తండ్రి.. ఓటీటీలో అదరగొడుతున్న ఎమోషనల్  ఫిల్మ్.. క్లైమాక్స్ లో కన్నీళ్లు ఆగవు..
X

దిశ, సినిమా: విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ' మహారాజా ' మూవీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం Netflix లో స్ట్రీమింగ్ అవుతుంది. సెలూన్ షాప్ నడుపుకునే వ్యక్తి.. ప్రాణంలా పెంచుకున్న కూతురి కోసం ప్రాణాలకు తెగించిన కథ.. ప్రాణాలను తీసిన కథ.. కన్నీళ్లు తెప్పిస్తుంది. చెత్త కుండి పోయిందని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లయింట్ తో మొదలైన స్టోరీ.. ఈ డస్ట్ బిన్ కథేంటని ఆడియన్స్ లో క్యూరియాసిటి పెంచడం, ఆ లోపే ఎమోషనల్ డ్రైవ్ చేయించడం స్టార్ట్ అయిపోతాయి. ఈ చెత్త బుట్టకు విలన్ కు ఉన్న సంబంధం ఏంటి? మహారాజా కూతురిని రేప్ చేసిన ఆ ముగ్గురు ఎవరు? ఎలా కనిపెట్టారు? పోలీసులు కేసును ఎలా చేధించారు? అనేది ప్రతి నిమిషం ఆసక్తిగా సాగుతుంది.

చెత్త బుట్ట స్టోరీ పదేపదే చెప్తూ పోలీసుల బుర్ర తున్న మహారాజా విజయ్ సేతుపతి.. అంతకు ముందు ఆ కథ చెప్తే నవ్వొస్తుంది కానీ ఇంటర్వెల్ బ్లాక్ లో అదే స్టోరీ చెప్తే మూవీ చూస్తున్న ఆడియన్స్ కు ఏడుపు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అక్కడి నుంచి మొదలైన విలన్స్ వేట.. చివరికి వచ్చేసరికి.. ఎమోషనల్ గానే ఎండ్ అవుతుంది. ఇక విలన్ పాత్రలో మెప్పించిన డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. ఇచ్చిన టైటిల్ కు జస్టిఫికేషన్ ఎలా చేశాడు? ఆయన కూతురు కథేంటి? అనేది మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ వీకెండ్ కు బెస్ట్ ఆప్షన్ కాగా చూసి ఎంజాయ్ చేయండి.

Advertisement

Next Story