తమిళ హీరో విశాల్‌పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం

by Maddikunta Saikiran |
తమిళ హీరో విశాల్‌పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో విశాల్ కు, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ మధ్య రోజు రోజుకి విభేదాలు మరింత ముదురుతున్నాయి.కాగా గతంలో విశాల్ హీరోగా తెరకెక్కిన 'పందెంకోడి-2' సినిమా సమయంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ వద్ద విశాల్ రూ. 21.29 కోట్లను అప్పుగా తీసుకున్నాడని, ఒప్పందం ప్రకారం విశాల్ డబ్బులు తిరిగి చెల్లించాలని,కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ సంస్థ యజమానులు మద్రాస్ హైకోర్టును 2022లో ఆశ్రయించారు.తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా విశాల్ ఈరోజు కోర్టుకు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాణ సంస్థతో జరిగిన ఒప్పందంపై కోర్టు అతన్ని ప్రశ్నించగా... తాను కేవలం ఖాళీ కాగితంపై సంతకం చేశానని, ఆ సంస్థతో ఒప్పందం జరిగిన విషయం తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. కాగా అతడు చేసిన వాఖ్యాలపై జడ్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ... తమకు తెలివిగా సమాధానం చెప్పొద్దని,ఇదేం సినిమా షూటింగ్ కాదని న్యాయమూర్తి బదులిచ్చారు. అంతే కాకుండా పందెంకోడి-2 విడుదలకు ముందే డబ్బు తిరిగి లైకా నిర్మాణ సంస్థకు ఇస్తానని మాటిచ్చారా? అని విశాల్ ను హైకోర్టు ప్రశ్నించగా.. విశాల్‌ సమాధానం ఇవ్వకుండ సైలెంట్‌ ఉన్నట్టు తెలుస్తోంది. చివరగా లైకా సంస్థ దగ్గర అప్పు తీసుకున్నట్లు విశాల్ అంగీకరిస్తూ...ఈ సమస్యను పరిష్కరించడానికి హైకోర్టును మధ్య వర్తిత్వాని కోరినట్లు సమాచారం.

Next Story

Most Viewed