అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన మడోన్నా.. పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-07-12 12:50:54.0  )
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన మడోన్నా.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ సింగర్ మడోన్నా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఐసీయూలో చేరిన ఆమె.. కొద్దిగా కోలుకున్నట్లు తెలుపుతూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్ చేసింది. ఈ మేరకు ‘ఆన్ ది రోడ్ రికవరీ.. నా దృష్టి ఇప్పుడు నా ఆరోగ్యం పూర్తిగా కోలుకోవడంపైనే ఉంది. నేను వీలైనంత త్వరగా మిమ్మల్ని కలుస్తాను. మీతో ఆడిపాడతాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తన ప్రపంచ పర్యటన రీషెడ్యూల్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటుందో కూడా ప్రకటించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. త్వరగా తిరిగిరావాలంటూ గాయనికి మద్దతుగా నిలుస్తూ.. ఆమెలో పాజిటివిటీని నింపుతున్నారు.

Read More: కంగన పెద్ద ఫ్రాడ్.. అంటూ లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన బీజేపీ నాయకుడు

Advertisement

Next Story