- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హృదయాన్ని కదిలించే వీడియో.. బాలీవుడ్ నటి సోదరి ఫ్యామిలీని హతమార్చిన హమాస్ ఉగ్రవాదులు
దిశ, సినిమా: ప్రముఖ టెలివిజన్ నటి, నాగిన్ ఫేమ్ మధురా నాయక్ జనాల హృదయాన్ని కదిలించే షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు మారణహోమం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ దాడుల్లో మధుర సోదరి, బావ, ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాలో సోదరి ఫ్యామిలీ ఫొటోను షేర్ చేస్తూ హమాస్ ఉగ్రవాదులు వాళ్లను దారుణంగా హత్య చేశారని వెల్లడించింది. చనిపోయే ముందు వాళ్ల పరిస్థితి, దాడికి సంబంధించిన వివరాలను చెప్తూ కన్నీటి పర్యంతమైంది. పిల్లల కళ్ల ముందే అక్క, బావ హత్యకు గురయ్యారని.. ఆ తర్వాత పసి పిల్లలను కూడా వదలిపెట్టలేదని చెప్పింది.
‘నేను ఒక యూదురాలిగా సిగ్గుపడ్డాను. అవమానించబడ్డాను. ఇజ్రాయెల్‌లను కోల్డ్ బ్లడెడ్ కిల్లర్స్‌గా చూపించే ఈ పాలస్తీనా అనుకూల అరబ్ ప్రచారం నిజం కాదని నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేను ఎలాంటి హింసను సమర్థించబోనని, ఇజ్రాయెల్‌లోని ప్రజల కోసం, బాధిత కుటుంబాల కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని కోరుతున్నా’ అంటూ ఎమోషనల్ అయింది.Israel-Hamas war