- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Adipurush Pre-Business Details : ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ బిజినెస్.. నిర్మాతలు సేఫ్
దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ మహాకావ్యం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో కృతి సనన్ సీతమ్మగా నటించగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించారు. ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఇక పోతే ఈ మూవీని దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన విషయం తెలిసిందే. కాగా మూవీ ప్రీ రిలీజ్ డీల్స్ కంప్లీట్ అయ్యాయి. దీని ద్వారా ఇప్పటికే రూ.432 కోట్లు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ డీల్ కూడా లాక్ చేసేశారట మూవీ మేకర్స్. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్.. జీఎస్టీ మినహా రూ. 185 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే దీన్ని బట్టి సౌత్‌లో డిస్ట్రిబ్యూటర్ రికవరీ కోసం ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది. చివరగా అన్ని భాషల్లో శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, నాన్ థియేట్రికల్ వసూళ్లు రూ.242 కోట్లు. కాగా వీటన్నిటిని బట్టి చూస్తే నిర్మాతలు సేఫ్ గానే ఉన్నట్లుగా తెలుస్తోంది.
Read more:
Pushpa 2: The Rule :అంతకు మించి.. ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు !