10 ఏళ్ల వయసులోనే ఆ పనిలోకి దిగిపోయా.. అమ్మతోపాటే నేను కూడా

by sudharani |   ( Updated:2023-06-19 12:16:30.0  )
10 ఏళ్ల వయసులోనే ఆ పనిలోకి దిగిపోయా.. అమ్మతోపాటే నేను కూడా
X

దిశ, సినిమా: టెలివిజన్ యాక్ట్రెస్ బేబికా ధూర్వే.. పేద కుటుంబంలో పుట్టిన కారణంగా 10 ఏళ్ల వయసులోనే అనేక కష్టాలు పడ్డానంటోంది. ‘బిగ్ బాస్’ ఓటీటీ2లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె.. తన చిన్ననాటి కష్టాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది. ‘ఇంటి పని నాకు చాలా బాగా తెలుసు. చిన్నప్పటినుంచి మా అమ్మ నాకు రోటీలు చేయడంలో శిక్షణ ఇచ్చింది. మాది పెద్ద కుటుంబం కాబట్టి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 40 రోటీలు చేసేదాన్ని. ఇంటికి సంబంధించిన ప్రతి పనిలోనూ నా పాత్ర ఉండేది. ఆ పని నాకు తెలిదు, రాదు అని సాకులు చెప్పలేదు. ఏదైనా బాధ్యతగా భావించి కర్తవ్యం నిర్వర్తించడమే తెలుసు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ‘సులభంగా గెలవడం వల్ల బలం రాదు. మీ పోరాటాలే మీ అసలైన బలాన్ని పెంచుతాయి. మీకు ఎదురైన కష్టాలను ఎదుర్కొవాలి. వాటికి లొంగిపోకూడదు. అప్పుడే మీపై మీకు మరింత విశ్వాసం పెరుగుతుంది’ అంటూ ఆర్నాల్డ్ చెప్పిన సిద్ధాంతాన్ని ఫాలోఅవుతానని తెలిపింది. బేబికా ప్రముఖ జ్యోతిష్యుడు జనార్దన్ ధూర్వే చిన్న కూతురు.

Advertisement

Next Story

Most Viewed