5 యూట్యూబ్ ఛానెల్లను టెర్మినేట్ చేయించిన "మా" అసోసియేషన్..

by Mahesh |
5 యూట్యూబ్ ఛానెల్లను టెర్మినేట్ చేయించిన మా అసోసియేషన్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో కొంతమంది యూట్యూబర్లు పనిగట్టుకొని సినీ నటులపై దారుణంగా ట్రోల్స్ చేయడంతో పాటు అసభ్యకరంగా దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. వీటిపై విసుగెత్తిపోయిన "మా" అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు పలువురికి నోటీసులు జారీ చేశారు. వెంటనే ఆయా ఛానల్ లో నటీనటులపై ఉన్న కంటెంట్ ను తొలగించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కానీ వారు వినకపోవడంతో మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. యూట్యూబ్ యాజమాన్యానికి కంప్లైంట్ చేసి.. దాదాపు ఐదు యూట్యూబ్ ఛానెల్లను శాశ్వతంగా తొలగించింది. అలాగే ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని.. తెలుగు నటీనటుల పై దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబర్స్ కు MAA హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed