- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జై బాలయ్య పాటపై ట్రోల్స్.. రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్ ట్వీట్..
దిశ, సినిమా : గోపీచంద్ మలినేని దర్శకత్వంలో, నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీర సింహారెడ్డి'. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా.. తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ ఇందులో వాడిన 'జై బాలయ్య జై జై బాలయ్య' అనే రిథమ్.. 'ఒసేయ్ రాములమ్మ' సినిమాలోని పాటను పోలి ఉండటంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 'మళ్లీ దొరికేసాడు భయ్యా' అంటూ తమన్‌ను ఆడేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇదే లిరికల్ సాంగ్ మేనియాపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్వీట్ చేయడంతో పెద్ద రచ్చకు దారితీసింది.
ఈ పాటలోని లిరిక్స్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు ఉన్నాయంటూ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రిపై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీంతో రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్‌గా ట్వీట్ చేశాడు. 'ప్రతి పాటను ప్రాణంపెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగినవారు మాత్రమే నాతో ప్రయాణించగలరు. అన్నట్టు.. జన్మనిచ్చిన అమ్మ గారి గౌరవార్ధం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రిగా మార్చుకున్నాను. ఇందులో ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి' అని దండం పెడుతూ పోస్ట్ చేశాడు.
ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను...దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు..అన్నట్టు...జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు..ఉంటే ఇటు రాకండి🙏
— RamajogaiahSastry (@ramjowrites) November 25, ౨౦౨౨READ MORE