- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్కార్ వచ్చినా.. నా లక్ష్యం నెరవేరలేదు: చంద్రబోస్
దిశ, సినిమా : ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించడంపై గేయ రచయిత చంద్రబోస్ తన అనుభూతిని వెల్లడించాడు. తాజాగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ క్షణాలు అనిర్వచనీయమైన అనుభూతినిచ్చాయి. ఆస్కార్ సాకారమైన క్షణాలు భావోద్వేగానికి గురిచేశాయి. భారత దేశ కీర్తిని, తెలుగు సాహిత్య గౌరవాన్ని నా చేతిలో నిలుపుకున్నట్లుగా అనిపించింది. నిజానికి ఒక్కసారైన జాతీయ పురస్కారం అందుకోవాలనేది నా లక్ష్యం. అది నెరవేరకముందే నాలుగు ఇంటర్నేషనల్ పురస్కారాలు లభించాయి. అయితే ఇది సాహిత్యంతోపాటు సహనానికి కూడా లభించిన అవార్డుగా భావిస్తా. నా 27ఏళ్ల కెరీర్‌లో 19 నెలలు రాసిన పాట ఇదొక్కటే. మన పూర్వికులు, నా సమకాలీకులు ఎన్నో గొప్ప పాటలు రాశారు. మనది గొప్ప సాహిత్యపరమైన, సంగీత పరమైన భాష అని ఆస్కార్ వేదికపై చెప్పాను. ఇప్పుడు నాపై చాలా బాధ్యతాయుతమైన బరువు పడింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా నడుచుకుంటూ గొప్ప సాహిత్యం అందించాలనుకుంటున్నా’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు.