- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Lucky Laxman' కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం: Sohail
దిశ, సినిమా: సయ్యద్ సోహైల్, మోక్ష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'లక్కీ లక్ష్మణ్'. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఏఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మించిన సినిమా డిసెంబర్ 30న రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బిగ్ టికెట్‌ను సోహైల్ తండ్రి సలీమ్‌కి డైరెక్టర్ అభి తండ్రి గంగిరెడ్డి అందించారు. ఈ మేరకు కార్యక్రమంలో మాట్లాడిన దర్శకనిర్మాతలు.. పరిమితమైన బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ఓ కొత్త ఒరవడిని తీసుకొస్తుందని, తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే థియేటర్ నుంచి బయటకు వచ్చాక మంచి సినిమా చూశామని ఫీల్ అవుతారని, తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకంతోనే థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. హీరో హీరోయిన్లు మాట్లాడుతూ.. మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్‌తో కూడిన సినిమాను కుటుంబ సమేతంగా చూడొచ్చని, ఎప్పటిలాగే తమను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకున్నారు.
ఇవి కూడా చదవండి : బాలీవుడ్ సంగీతంలో గజల్‌ను చేర్చండి: శ్రీజనీ ఘోష్