అలా చేయడం వల్లే అతడిపై ప్రేమ మొదలైంది అతను ఓ ప్రత్యేకమైన వ్యక్తి.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

by Hamsa |   ( Updated:2023-06-13 05:25:52.0  )
అలా చేయడం వల్లే  అతడిపై ప్రేమ మొదలైంది అతను ఓ ప్రత్యేకమైన వ్యక్తి..  స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం నటనతో తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా డేటింగ్ రూమర్స్‌పై స్పందించింది. వీరిద్దరు కలిసి ‘లస్ట్‌స్టోరీస్-2’ తో రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా మాట్లాడుతూ.. ‘‘సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నాకు చాలా మంది సహ నటులు ఉన్నారు. కానీ, విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు రక్షణగా నిలబడతాడు అనే నమ్మకం ఉంది. మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్ బంధం ఉంది. నన్ను కిందకి లాగే వారి నుండి రక్షిస్తాడు. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అనుకోకుండా ఆ ప్రపంచంలోకి నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి వచ్చాడు. అతను నా పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న ప్రదేశం నాకు సంతోషకరమైన ప్రదేశం’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: నేడు హాట్ భామ దిశా పటాని పుట్టిన రోజు

ట్విట్టర్ ట్రెడ్డింగ్‌లో SSMB29.. ఆగస్టు 9న స్టార్ట్..?

Advertisement

Next Story

Most Viewed