విజయ్ ‘లియో’లో సంజయ్ దత్‍ లుక్ లీక్ చేసిన లోకేష్ (వీడియో)

by Anjali |   ( Updated:2023-07-29 13:59:03.0  )
విజయ్ ‘లియో’లో సంజయ్ దత్‍ లుక్ లీక్ చేసిన లోకేష్ (వీడియో)
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‍, దర్శకుడు లోకేశ్ కనగరాజ్‍ కాంబోలో తెరక్కెకుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ రోజు (జూలై 29) సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన పాత్రకు సంబంధించిన వీడియో గ్లింప్స్‌ రిలీజ్ చేశాడు లోకేష్ కనగరాజ్. ‘ఆంటోనీ దాస్‍ను మీట్ అవండి.. సంజయ్ దత్ సార్.. మా నుంచి మీకు స్మాల్ గిఫ్ట్! మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్ డే సార్’ అంటూ విషెస్ తెలిపాడు. ఇక ఈ వీడియోలో సంజయ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించాడు. ఇక సంజయ్ సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నప్పటికీ.. ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనుకాడడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది వరుసగా కేజీఎఫ్ 2, సామ్రాట్ పృథ్వీరాజ్, షంషేరా వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ‘కేజీఎఫ్ 2’లో సంజయ్ అథిరా పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

Advertisement

Next Story