పవన్ కల్యాణ్‌లా జీవించడం అంత ఈజీ కాదు!

by GSrikanth |   ( Updated:2023-04-07 16:03:59.0  )
పవన్ కల్యాణ్‌లా జీవించడం అంత ఈజీ కాదు!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే ఒక తరం యువత ఊగిపోతారు. గొప్ప నటుడు కాదు.. గొప్ప డ్యాన్సర్ కాదు.. అయినా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఓ వైపు సినిమాలు.. మరో వైపు రాజకీయాలతో జోడు గుర్రాల స్వారీ చేస్తూ.. బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్‌గా ఒప్పుకున్న ‘వినోదయ సిత్తం’ షూటింగ్‌లో తన పార్ట్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ సెట్‌లోనే ఏపీకి చెందిన కొందరు కౌలు రైతు కుటుంబాలకు చెక్కులు అందజేశారు.


అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో ఓ వేడుకకు హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి పలు సినిమా షూటింగ్స్‌లో పాల్గొని.. వెంటనే ఢిల్లీకి వెళ్లి.. అక్కడ బీజేపీ పెద్దలతో వరుస భేటీలు జరిపారు. ఆ వెంటనే వచ్చి హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్’ షూటింగ్‌ ప్రారంభించారు. ఆ తర్వాత వెంటనే వరంగల్‌లో ఓ కళాశాల వేడుకలో పాల్గొని ప్రసంగించారు.


తిరిగి మళ్లీ నగరానికి వచ్చి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఇదంతా గమనిస్తున్న పవన్ అభిమానులు.. ఇతర నటులకు జనసేనానికి మధ్య తేడా ఇదేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఓ వైపు జనాల సమస్యలు.. మరోవైపు సినిమాలు చేస్తూ తీవ్రంగా కష్టపడుతున్న సేనానిని చూసి ఎమోషనల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ మాదిరిగా జీవించడం ఏ హీరోకు సాధ్యం కాదంటూ నెట్టింట్లో పోస్టులు పెట్టి గర్వంగా ఫీల్ అవుతున్నారు.



ఇవి కూడా చదవండి:

జగన్ పాలనపై నందమూరి బాలకృష్ణ విమర్శల కార్టూన్ (07-04-2023)

Advertisement

Next Story

Most Viewed