- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లావణ్య బాటలోనే మృణాల్.. తెలుగు హీరోను పెళ్లి చేసుకోబోతుందా! నిర్మాత కామెంట్స్ వైరల్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘సీతారామం’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. మొదటి మూవీతోనే ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పలు వెబ్‌సిరీస్, వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా, మృణాల్ సైమా అవార్డ్ ఫంక్షన్‌కు హాజరైంది. ఈ నేపథ్యంలో ఓ బడా నిర్మాత ఆమెను తెలుగు వారి కోడలు కావాలని ఆశీర్వదించాడు. అసలు విషయంలోకి వెళితే.. టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ తరపున ఎన్నో చిత్రాలను తీసి ప్రేక్షకుల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించారు. అయితే గతంలో ఆయన ఓ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠిని హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుని వచ్చేయ్ అమ్మా అని అన్నాడు.
ఆయన ఆశీర్వాదం ఫలించి ఆమె వరుణ్ తేజ్‌ను ప్రేమించి ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుందని అందరూ చర్చించుకున్నారు. ఇక వరుణ్-లావణ్య పెళ్లి నవంబర్ 1న ఇటలీలో జరనుందన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సైమా అవార్డ్స్‌లో ‘సీతారామం’ సినిమాకు ఉత్తమ నటిగా మృణాల్ నిలిచింది. ఈ అవార్డును అల్లు అరవింద్ ప్రజెంట్ చేసి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ గతంలో ఓ వేదికపై హీరోయిన్‌తో ఓ మాట అన్నాను. తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని టాలీవుడ్‌కి కోడలిగా వచ్చేయమన్నాను. ఆ మాటని ఆమె నిజం చేసింది. ఇప్పుడు నీతో కూడా అదే మాట అంటున్నా. టాలీవుడ్ కోడలిగా హైదరాబాద్‌కి వచ్చేయ్’’ అని చెప్పుకొచ్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన నెటిజన్లు మృణాల్ పెళ్లి, లావణ్య లాగా టాలీవుడ్ హీరోతో జరగడం ఖాయం అని కామెంట్లు చేస్తున్నారు.