మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠీ ?

by Jakkula Samataha |
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠీ ?
X

దిశ, సినిమా : మెగా ఫ్యాన్స్‌లో ఆనందం మొదలైంది. నాగబాబు, అల్లు అర్జున్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ, వారికి ఓ గుడ్ న్యూస్ అందింది అంటున్నారు మెగా అభిమానులు. ఇంతకీ ఆ శుభవార్త ఏంటీ అనుకుంటున్నారా? మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నారంట. నాగబాబు కోడలు, హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠీ తల్లికాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన లావణ్య త్రిపాఠీ, మిస్టర్ సినిమాతో వరుణ్‌ తేజ్‌తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రహస్యంగా డేటింగ్‌లో ఉన్న వీరు తర్వాత పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరికి వివాహం జరిగి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోతున్నాయి. దీంతో ఈ కపుల్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందా అని జనాలు తెగ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఊహించని సర్ప్రైజ్ అందింది. నెట్టింట్లో నాగబాబు తాతయ్య కానున్నాడా అనే గుసగుసలు మొదలు అయ్యాయి. అయితే దీనిని కొందరు కొట్టిపారేస్తే మరి కొందరు అవును అనే సమాధానమే ఇస్తున్నారు. ఎందుకంటే? లావణ్య ఓ బాబుతో కలిసి ఉన్న పోస్ట్ చేసింది. అయితే ఆమె తల్లికాబోతుందని డైరెక్ట్‌గా చెప్పలేకనే, ఆలా ఇన్ డైరెక్ట్‌గా చెప్పుకొచ్చింది. త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడు.. ఏమో మెల్లిగా లావణ్య అఫీషియల్‌గా త్వరలోనే ఈ గుడ్ న్యూస్ చెప్తుందేమో అంటూ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, దీనిపై బ్యూటీ స్పందిస్తేకానీ ఎలాంటి క్లారిటీ వచ్చేలా లేదు.

Advertisement

Next Story