Prabhas సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది: Kriti Sanon

by Harish |   ( Updated:2023-02-04 07:47:43.0  )
Prabhas సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది: Kriti Sanon
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కృతిసనన్ 'ఆదిపురుష్' చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటించిన హిందీ చిత్రం 'షెహజాదా' ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న బ్యూటీ.. ప్రభాస్‌‌కు జోడిగా నటించిన 'ఆదిపురుష్' రిలీజ్ కోసం కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

''ఆదిపురుష్' అందరూ గర్వించదగ్గ సినిమా. ప్రజలు కూడా దాన్ని చూసి గొప్పగా ఫీల్ అవ్వాలనే ప్రార్థిస్తున్నా. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, అంతకు మించిన మార్గాన్ని కలిగి ఉంది. ఈ చిత్రానికి తగిన రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నా. ఈ కథ గురించి పిల్లలకు తెలియజేయడం చాలా ముఖ్యం. ఇలాంటి కథలు వారి మనసుల్లో ముద్రించబడాలని నేను భావిస్తున్నా. రామాయణంపై అవగాహన కల్పించేందుకు ఇదే ఉత్తమ మార్గం' అంటూ తన అభిప్రాయాలు షేర్ చేసుకుంది. ఇక 'ఆదిపురుష్' భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజ్‌కానుంది.

ఇవి కూడా చదవండి : బన్నీకి సిగ్నల్ ఇస్తున్న స్నేహ.. పోస్ట్ వైరల్

Advertisement

Next Story