ప్లీజ్ విజిట్ యువర్ ఓన్ రిస్క్.. 'భేడియా' ఫస్ట్ లుక్‌పై కృతి

by srinivas |
ప్లీజ్ విజిట్ యువర్ ఓన్ రిస్క్.. భేడియా ఫస్ట్ లుక్‌పై కృతి
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ కృతి సనన్ రాబోయే చిత్రం 'భేడియా'. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కృతి 'డాక్టర్ అనికా' పాత్రలో నటించగా.. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో బేబీ కటింగ్, చేతిలో ఇంజెక్షన్ పట్టుకుని సరికొత్త స్టైలిష్ అవతార్‌లో కనిపించిన నటి.. ఆశ్చర్యకరమైన లుక్‌తో అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను నెట్టింట పోస్ట్ చేసిన కృతి.. 'మీట్ డాక్టర్ అనికా. భేడియాకి డాక్టర్. హ్యూమన్స్ ప్లీజ్ విజిట్ యువర్ ఓన్ రిస్క్. భేడియా ట్రైలర్ హౌలింగ్ టుమారో' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక హారర్ కామెడీ‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో యంగ్ హీరో వరుణ్ ధావన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా అక్టోబర్ 19న ట్రైలర్ రిలీజ్ కానుండగా.. నవంబర్ 25న సినిమా విడుదల కానుంది.

Advertisement

Next Story