- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్‌తో పెళ్లి వార్తలన్నీ పుకార్లే.. కొట్టిపారేసిన కృతి
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటుడు ప్రభాస్‌తో డేటింగ్, మ్యారేజ్ రూమర్స్‌పై ఎట్టకేలకు స్పందించింది. గత వారం రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది కృతి. 'ఇది ప్రేమ కాదు.. అలాగని పీఆర్ స్టంట్ కూడా కాదు. మా 'భేడియా' అంటే వరుణ్ ధావన్ ఆ రియాలిటీ షోలో కాస్త కావాలని ఇలా మాట్లాడాడు. అతని వ్యంగ్యం ఎక్కడికో దారితీసి అనేక రకాల పుకార్లకు తావిస్తోంది. వెబ్‌సైట్స్ మా పెళ్లి తేదీ కూడా ప్రకటించకముందే ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. ఇవన్నీ పుకార్లు మాత్రమే' అని కొట్టిపారేసింది. దీంతో గతకొద్ది రోజులుగా నెట్టింట వైరల్ అవుతోన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లు అయ్యింది.
ఇవి కూడా చదవండి : మాజీ ప్రియుడితో రాసలీలలు.. దొరికిపోయేసరికి స్నేహితుడంటూ ప్లేట్ ఫిరాయింపు