నా భార్య Ramya Krishna అమాయకురాలు కాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన Krishna Vamshi

by samatah |   ( Updated:2022-09-09 12:20:24.0  )
నా భార్య Ramya Krishna అమాయకురాలు కాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన Krishna Vamshi
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసిన ఎన్నో సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఇక ఈయన సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్య క్రిష్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలా రోజుల నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ, సోషల్ మీడియాలో గుస గుసలు వినబడుతున్నాయి.

అయితే రంగమార్తండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో తన భార్య రమ్య కృష్ణ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పెళ్లి అంటే ఇష్టం లేని నేను, రమ్యను చూడగానే ప్రేమలో పడిపోయా, తననే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.

గత కొంత కాలం నుంచి మేము విడాకులు తీసుకోబోతున్నమంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ రూమర్స్, మేము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. శ్రీఆంజనేయం సినిమా టైంలో మా మధ్య విభేదాలు వచ్చాయన్నారు కానీ అవేమి లేవు, తాను సినిమాకు పెట్టుబడులు పెట్టలేదు. తాను మీరు అనుకునేంత అమాయకురాలు కాదు. చాలా తెలివిగలది, మంచి ఆలోచనలతో ఫ్యామిలీని ముదుకుతీసెకెళ్తుందంటూ తెలిపారు.

Also Read: నా భర్తతో కమిట్ అవ్వడం ఇష్టం లేదు: షాకిచ్చిన స్టార్ హీరోయిన్

Next Story