‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 8.. క్యూరియాసిటీ పెంచేస్తున్న ప్రోమో.. ఈసారి రచ్చ రచ్చే!

by sudharani |   ( Updated:2023-10-05 15:48:18.0  )
‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 8.. క్యూరియాసిటీ పెంచేస్తున్న ప్రోమో.. ఈసారి రచ్చ రచ్చే!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్‌ కరణ్ జోహార్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇటీవలే ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సినిమాతో బ్లక్ బ‌స్టర్ హిట్ అందుకున్న ఆయన.. తను హోస్ట్ చేసిన పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ నయా సీజన్ గురించి బిగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ‘Koffee with Karan 8’ అక్టోబ‌ర్ 26 నుంచి ప్రారంభంకానున్నట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రక‌టించాడు. అంతేకాదు ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేయగా.. ‘‘కాఫీ విత్ కరణ్’ కొత్త సీజన్ కోసం మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు. మీ కోరికలు మాకు తెలిసిపోయాయి. సీజన్ 7 నుంచి వ‌చ్చిన‌ అద్భుతమైన స్పందన తర్వాత ఈ సీజన్‌లో నా స్నేహితులు, మీకు ఇష్టమైన సెలబ్రిటీలు వారి రహస్యాలను పంచుకునేలా ప్లాన్ చేద్దాం. డిస్నీ+ హాట్‌స్టార్‌లో సీజన్ 8తో తిరిగివస్తున్నాం. సీజన్ 8తో కాఫీని తయారు చేద్దాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక గ‌త సీజ‌న్ లాగే ఈ సీజ‌న్ కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ కాబోతుంది.

Advertisement

Next Story