Kirrak Rp- Babu Mohan: కిరాక్ ఆర్పీ పై సంచలన కామెంట్స్ చేసిన స్టార్ కమెడియన్.. నువ్వెంత? నీ బతుకెంత అంటూ

by Kavitha |   ( Updated:2024-07-24 09:17:00.0  )
Kirrak Rp- Babu Mohan: కిరాక్ ఆర్పీ పై సంచలన కామెంట్స్ చేసిన స్టార్ కమెడియన్.. నువ్వెంత? నీ బతుకెంత అంటూ
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా చాలామంది నటీనటులు పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో కిరాక్ ఆర్పీ కూడా ఒకరు. స్టార్టింగ్‌లో ధన్ రాజ్ టీమ్‌లో కంటెస్టెంట్‌గా చేసి, తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. అలా కొన్నాళ్ళు టీమ్ లీడర్‌గా తన స్కిట్స్‌తో, డిఫరెంట్ స్టైల్ కామెడీతో ఆడియన్స్‌ను బాగా నవ్వించి.. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఏమైందో ఏమో కానీ సడెన్‌గా కిర్రాక్ ఆర్పి ఈ షో నుంచి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది షో చేసాడు. అలాగే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే షాప్ పెట్టి ప్రస్తుతం అదే బిజినెస్ చూసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్పీ.. మల్లెమాల సంస్థపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా ఎన్నో కోట్లు సంపాదిస్తున్న అక్కడ వసతులు సరిగా ఉండవని సరైన తిండి ఉండదని, గౌరవం ఇచ్చేవారు కాదని చెప్పారు. అయితే ఆర్పీ చేసిన ఈ ఆరోపణలపై ప్రముఖ సీనియర్ కమెడియన్, నటుడు అయిన బాబూమోహన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ క్రమంలోనే ఆర్పీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ” జబర్దస్త్ లోకి రాకముందు నువ్వెంత ? నీ బతుకెంత?. పొట్ట కూటి కోసం ఇక్కడికి వచ్చావు. వచ్చాక నిన్ను నలుగురు గుర్తు పట్టేసరికి నీ కళ్ళు నెత్తికెక్కాయి. మల్లెమాల అంటే ఎవరు చిత్ర సీమకే ఒకే తండ్రి MS రెడ్డి గారు. జబర్దస్త్‌ను నడిపేది ఆయన కొడుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. అలాంటి ఓ గొప్ప సంస్థ నీకు అన్నం పెట్టింది. ఆ సంస్థపై ఆరోపణలు చేయడానికి నీకు సిగ్గు లేదు.. అన్నం పెట్టిన చేయినే కొరుకుతావా? అని ఆర్పిపై మండిపడ్డారు. అన్నం పెట్టిన చేయిని కొరికితే ఆ తర్వాత ఆ అన్నం దొరకకుండా పోతుంది. ఎంతోమందికి పనిచ్చి అన్నం పెట్టే ఆ సంస్థ ఇంకా బాగుండాలి అని కోరుకోవాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నాకు జీవితాన్ని ఇచ్చింది కూడా ఆ సంస్థే. నన్ను ఈ రోజు ఇంత పెద్ద స్టార్‌ను చేసింది కూడా వాళ్లే” అంటూ బాబూమోహన్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట దుమ్ము దుమారం రేపుతున్నాయి.

(video link credits to RedTV youtube channel)

Advertisement

Next Story