రామ్ చరణ్ కోసం చేతి వేళ్లు వంకర పోగొట్టుకున్న కియారా.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Prasanna |   ( Updated:2023-08-04 12:08:54.0  )
రామ్ చరణ్ కోసం చేతి వేళ్లు వంకర పోగొట్టుకున్న కియారా.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ తన అప్ కమింగ్ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉండగా.. అప్పుడే సినిమాను ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది కియారా. ఈ క్రమంలోనే చరణ్‌ తనకు ప్రియమైన స్నేహితుడని, శంకర్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాననంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘శంకర్ సర్ ‘గేమ్‌ ఛేంజర్‌’ను చాలా బాగా డిజైన్‌ చేశారు. ప్రతీ ఒక్కరి అంచనాలకు మించి ఉంటుంది. మేమంతా అహర్నిశలు చెమటోడ్చి పనిచేశాం. అభిమానులకు ఈ మూవీ ఓ పెద్ద బొనాంజా లాంటిది. ఈ సినిమా కోసం ఓ సన్నివేశంలో నటిస్తున్నపుడు నా చేతి వేళ్లు వంకర పోయాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు.. సినిమా ఎలా ఉండబోతుందో’ అంటూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఇక ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్‌ లుక్‌ నెట్టింట వైరల్ అవుతుండగా.. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న మూవీలో హ్యారీ జోష్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక తెలుగమ్మాయి అంజ‌లి మరో ఫీమేల్ లీడ్ రోల్‌‌లో కనిపించనుంది.

Read More: బూబ్స్‌ను గాలికి వదిలేసిన నటి.. చూసిన యువత ఊరుకుంటుందా..? (ఫొటోలు)

Advertisement

Next Story