నటిగా కాకుండా ఒక డైరెక్టర్‌గా ఫీల్ అవుతూ పనిచేస్తా: Kiara Advani

by Prasanna |   ( Updated:2022-12-22 07:48:10.0  )
నటిగా కాకుండా ఒక డైరెక్టర్‌గా ఫీల్ అవుతూ పనిచేస్తా: Kiara Advani
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కియారా అద్వానీ 2021-2022 తనకు చిరస్మరణీయమైనవిగా నిలిచిపోతాయంటోంది. 2021లో వచ్చిన 'షేర్‌షా' 2022లో 'జగ్‌జగ్ జీయో', 'భూల్ భులయ్యా 2' అన్ని రంగాల ప్రేక్షకులకు నచ్చడంతోపాటు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా సంపాదించడం లక్కీగా భాస్తున్నట్లు తెలిపింది. అలాగే ఇటీవల వచ్చిన 'గోవింద నామ్ మేరా' చిత్రం గురించి మాట్లాడుతూ.. 'ఈ సినిమా మాకోసం కాకుండా ప్రేక్షకుల మెప్పుకోసమే కష్టపడి చేశాం. ప్రతి ఒక్కరూ ఇష్టపడాలని, నవ్వుతూ, సంతోషంగా థియేటర్ నుంచి బయటకు రావాలని కోరుకున్నాం. అంతేకాదు ఇలాంటి సినిమాలను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని అభిమానులు చెప్పడం అతిపెద్ద బహుమతిగా భావిస్తున్నాం' అని చెప్పింది. అలాగే తను నటించిన ప్రతి సినిమా విడుదలైన మొదటిరోజు అభిమానుల తొలి తీర్పు ఎలా ఉంటుందోనని ఆందోళనకు గురవుతానన్న కియారా..తనను తాను దర్శకురాలిగా, నటిగా పిలుచుకుంటానని చెప్పింది. ఎందుకంటే తన ప్రాజెక్టుల షూటింగ్ టైమ్‌లో దర్శకుడి పనితీరుపై దృష్టిపెడతానని, 'గోవింద నామ్ మేరా' కోసం శశాంక్ ఖైతాన్ చూపించిన కోణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు తెలిపింది.

Read more:

Priyanka Jawalkar:హాట్ అందాలను వడ్డిస్తూ మతి పోగొడుతున్న ప్రియాంక జవాల్కర్

Advertisement

Next Story