సల్మాన్‌కు జోడిగా కియారా అద్వానీ.. లక్కీ ఛాన్స్ కొట్టేసిందంటున్న ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2024-02-03 13:25:46.0  )
సల్మాన్‌కు జోడిగా కియారా అద్వానీ.. లక్కీ ఛాన్స్ కొట్టేసిందంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ కియారా అద్వానీ పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఈ మధ్య ' సత్య ప్రేమ కీ కథ ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బ్యూటీ.. ప్రస్తుతం ' గేమ్ చేంజర్ ' తోపాటు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అయితే చాలా గ్యాప్ తర్వాత ' టైగర్ 3 ' తో సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సల్మాన్ ఖాన్ నెక్స్ట్ ఫిల్మ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు టాక్. కరణ్ జోహార్ నిర్మిస్తున్న మూవీని విష్ణు వర్ధన్ డైరెక్ట్ చేయబోతుండగా.. ఈ యూనిక్ కంటెంట్ కలిగిన సినిమా 'The Bull' లో కియార హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు సమాచారం. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు కానున్న సినిమా 2025 మొహర్రంకు విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ నెటిజన్స్ సల్మాన్ తో కియారా స్క్రీన్ అప్పియరెన్స్.. మనవడు, మనవరాలి మాదిరిగా ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం సినీ ఇండస్ట్రీలో రికార్డ్ సెట్ చేయబోయే మూవీ.. కియారకు రావడం హ్యాపీగా ఉందని అంటున్నారు.

Advertisement

Next Story