‘ఎదకు ఒక గాయం.. వదల మంది ప్రాణం’.. ఆకట్టుకుంటున్న ఖుషి ఫోర్త్ సింగిల్

by Hamsa |   ( Updated:2023-10-10 15:40:28.0  )
‘ఎదకు ఒక గాయం.. వదల మంది ప్రాణం’.. ఆకట్టుకుంటున్న ఖుషి ఫోర్త్ సింగిల్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత జంటగా వస్తున్న సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకోగా.. తాజాగా నాలుగో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఎదకు ఒక గాయం.. వదల మంది ప్రాణం’ అంటూ సాగే ఈ సాంగ్ అత్యంత అద్భుతంగా ఆకట్టుకుంటుందో. రిలీజ్ చేసిన అరగంట లోనే 110K వ్యూస్ సాధించింది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్‌ను ఈ సాంగ్ బీట్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. ‘ఖుషి’ మూవీ సెప్టెంబర్-1 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story