అర్దరాత్రులు ఇంటికొస్తున్న శ్రీదేవి చిన్న కూతురు.. ఖుషిపై కోపంగా ఉన్న తండ్రి

by Prasanna |   ( Updated:2023-09-01 07:14:58.0  )
అర్దరాత్రులు ఇంటికొస్తున్న శ్రీదేవి చిన్న కూతురు.. ఖుషిపై కోపంగా ఉన్న తండ్రి
X

దిశ, సినిమా: నిర్మాత బోనీ కపూర్, దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ తన డెబ్యూ ఫిల్మ్ ‘ఆర్చీస్’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. జోయా అక్తర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని ప్రమోట్ చేస్తున్న బ్యూటీ.. ఇందులో తాను బెట్టీ కూపర్ పాత్ర పోషిస్తున్నట్లు చెప్పింది. అయితే 'సాధారణంగా పిల్లల విషయంలో బోనీ కపూర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు కదా. ఈ సినిమా ప్రచారంతో బిజీ అయిపోయి.. లేట్ నైట్ ఇంటికెళ్లినపుడు తండ్రి చూపించే కోపాన్ని ఎలా ఎదుర్కొంటావ్?' అనే ప్రశ్నకు ఫన్నీగా బదులిచ్చింది. ‘సాధారణమైన ఖషీ కపూర్ అయితే లాంగ్ అపాలాజీ టెక్ట్స్ పంపుతుంది’ అని చెప్పింది. అలాగే 'తండ్రి స్థానంలో మీరుంటే ఏమీ చేస్తారు?' అని అడగగా.. ‘నేనైతే స్వీట్ వార్నింగ్ ఇస్తా. కానీ సినిమాలోని బెట్టీ మాత్రం ఆ క్షమాపణ లేఖను చింపేయడం లేదా కాల్చి పడేస్తుంది’ అంటూ తన రియల్ అండ్ రీల్ క్యారెక్టర్ల గురించి చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల ఈ మూవీ రిలీజ్ గురించి నెట్టింట ఓ పోస్ట్ పెట్టిన ఖుషి.. ‘మా కథకు కౌంట్‌డౌన్ మొదలైంది. ‘ఆర్చీస్’ డిసెంబర్ 7న రాబోతుంది. రిమైండర్ పెట్టుకోండి’ అంటూ తన ఫ్యాన్స్‌ను అలర్ట్ చేసింది.

Read More: తారక్-హృతిక్‌ల ‘వార్-2’ నుంచి సాలిడ్ అప్‌డేట్.. ఆ స్పెషల్ డే నాడే రిలీజ్ చేస్తారట?

Advertisement

Next Story

Most Viewed