భావన ఏంటీ ఇలా మారిపోయావు.. స్టార్ హీరోయిన్‌కు మించిన అందంతో కేరింత బ్యూటీ!

by Jakkula Samataha |
భావన ఏంటీ ఇలా మారిపోయావు.. స్టార్ హీరోయిన్‌కు మించిన అందంతో కేరింత బ్యూటీ!
X

దిశ, సినిమా : కేరింత మూవీ ఎంత మంచి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా భావన పాత్రలో నటించిన సుకృతి మంచి మార్కులు కొట్టేసింది.సుమంత్ అశ్వీన్, శ్రీ దివ్య హీరోహీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాలో,నూకరాజు గర్ల్ ఫ్రెండ్‌గా భావన నటించింది. దీంతో సృకితిగా కాకుండా, భావన అంటే ఈమెను గుర్తు పట్టే రేంజ్‌లో ఆ పాత్రలో ఈ బ్యూటీ నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ నటి ఏ సినిమాలోనూ కనిపించలేదు. తన తండ్రి చూసిన సంబంధం పెళ్లి చేసుకుని హాయిగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కేరింత భామ సినిమాలకు దూరమైన, సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఆమె తన తాజా ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా,ట్రెండీ డ్రెస్‌లో స్టార్ హీరోయిన్‌కు తీసి పోని రేంజ్‌లో ఉంది. దీంతో ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed