Keerthy :‘రఘు తాత’ కోసం చీర కట్టిన కీర్తి సురేష్.. సారీలో బ్యూటీ ఎంత అందంగా ఉన్నదంటే?

by Jakkula Samataha |
Keerthy :‘రఘు తాత’ కోసం చీర కట్టిన కీర్తి సురేష్.. సారీలో బ్యూటీ ఎంత అందంగా ఉన్నదంటే?
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ కీర్తీ సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారడమే కాకుండా, మంచి గుర్తింపు సంపాదించింది. దీంతో అమ్మడుకు ఇక్కడ మంచి మంచి అవకాశాలు రావడంతో అన్ని సినిమాలను ఓకే చేసి నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో చాలా వరకు అవకాశాలు తగ్గాయి.దీంతో ఈ నటి బాలీవుడ్ చెక్కేసి అక్కడ పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మహానటి తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అందాలతో అదరగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసిపోయింది. కీర్తి సురేష్ చీరలో చాలా బాగుంటుంది అంటారు తన అభిమానులు. కాగా, ఈమె రీసెంట్‌గా తన సోషల్ మీడియా అకౌంట్‌లో చీరలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అవి ప్రస్తుతం నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.

అయితే కీర్తి నటించిన తమిళ సినిమా రఘు తాత త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మూవీ టీం సినిమా ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగానే ఈ బ్యూటీ చీరలో సందడి చేసినట్లు సమాచారం. అంతే కాకుండా,మూవీ లాంచిగ్ ఈవెంట్‌లో కూడా ఈ బ్యూటీ సారీలో అందరినీ ఆకట్టుకుందంట.

Advertisement

Next Story