వెన్నెల పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది: కీర్తి సురేష్

by Anjali |
వెన్నెల పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది: కీర్తి సురేష్
X

దిశ, సినిమా: నాని, కీర్తి సురేష్ జంటగా వస్తున్న చిత్రం ‘దసరా’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. మార్చి 30న ఈ మూవీ విడుదలకానున్న నేపథ్యంలో సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది కిర్తీ సురేష్. ‘‘దసరా’లో సవాల్‌తో కూడిన పాత్ర చేశా. తెలంగాణ యాస మాట్లాడే క్యారెక్టర్ మొదట కష్టం అనిపించిది. తర్వాత నేనే డబ్బింగ్ చెప్పా. వెన్నెల పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. మేకప్ కోసమే కొన్ని గంటలు పట్టేది. దుమ్ము, బొగ్గు వంటి రస్టిక్ బ్యాక్ డ్రాప్‌లో షూట్ చేశాం. ‘మహానటి’ తర్వాత ఈ సినిమాతో ఎమెషనల్‌గా కనెక్ట్ అయ్యాను. నాని గారితో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది. ‘చమ్కీల అంగీలేసి’ పాట మేము ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించింది. ప్రస్తుతం కొన్ని కథలు విన్నాను. మంచి స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story