చిల్ బేబీ చిల్.. మహానటిలో మరో యాంగిల్..చిందేస్తున్న బ్యూటీ పిక్స్ వైరల్!

by Jakkula Samataha |   ( Updated:2024-05-01 10:28:39.0  )
చిల్ బేబీ చిల్.. మహానటిలో మరో యాంగిల్..చిందేస్తున్న బ్యూటీ పిక్స్ వైరల్!
X

దిశ, సినిమా : మహానటి అనగానే ఈ తరం వారికి గుర్తు వచ్చేది కీర్తి సురేష్. ఎందుకంటే మహానటి సావిత్రి సినిమాలో తన నటనతో అందరినీ అంతలా ఆకట్టుకుంది. సావిత్రినే దిగొచ్చిందా అనిపించే విధంగా ప్రేక్షకులను ఆకట్టుకొని, జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఈ నటి తన నటనతో అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. నేను శైలజా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో మంచి హిట్ అందుకుని, తన నటనతో ప్రశంసలు అందుకుంది.

ఇక ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోల సరసన ఆడి పాడి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ నటి చివరగా తెలుగులో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లిగా నటించింది. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గినట్లే తెలుస్తోంది. అయితే ఈ బ్యూటీ త్వరలో బాలీవుడ్‌లో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. బేబి జాన్ మూవీతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనందంట. ఈ క్రమంలోనే కీర్తికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఓ పార్టీలో ఈ నటి చిందులేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మోడ్రన్ డ్రెస్‌లో .. తన చిరు నవ్వుతో డ్యాన్స్ చేస్తున్న ఫొటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫోటోలు చూసిన తన ఫ్యాన్ మహానటిలో మరో యాంగిల్.. చిల్ బేబీ చిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ ఫొటోస్‌పై మీరు ఓ లుక్ వేయండి.

Advertisement

Next Story