అందానికే అసూయ పుట్టిస్తున్న మహానటి న్యూ లుక్.. ఫ్యాన్స్ ఫిదా

by Dishaweb |   ( Updated:2023-08-20 15:46:16.0  )
అందానికే అసూయ పుట్టిస్తున్న మహానటి న్యూ లుక్.. ఫ్యాన్స్ ఫిదా
X

దిశ, సినిమా: మహానటి కీర్తిసురేశ్‌ బ్యూటీఫుల్ లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులను అట్రాక్ట్ చేసింది. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ‘మామన్నన్’ జూన్‌లో విడుదలై బిగ్ హిట్ సొంతం చేసుకోగా ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ సరసన ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది కీర్తి సురేష్. అయితే ఈ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. కాగా ఈవెంట్‌కు బ్లాక్ కలర్ శారీతో హాజరైన నటి వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జీబ్రాను పోలిన చారలతో డిజైన్ చేయబడ్డ చీరకట్టు, బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్, పొడవాటి భిన్నమైన చెవిపోగుతలతో వచ్చిన బ్యూటీ అందానికే అసూయ పుట్టేలా కనిపించింది. అలాగే సినిమాను ఉద్దేశిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ప్రేక్షకులను అలరించగా ప్రస్తుతం కీర్తి ట్రెడిషనల్‌ లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మహానటి అంటే ఆ మాత్రం ఉంటుందంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Advertisement

Next Story