keeravani ఎమోషనల్ ట్వీట్‌.. కొంచెం గ్యాప్ ఇవ్వు అంటూ Rajamouli పోస్ట్

by sudharani |   ( Updated:2023-01-26 14:47:14.0  )
keeravani ఎమోషనల్ ట్వీట్‌.. కొంచెం గ్యాప్ ఇవ్వు అంటూ Rajamouli పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమౌళి తెరకెక్కించిన 'RRR' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఎంఎం కీరవాణి సంగీతం అందించిన 'నాటు నాటు' సాంగ్‌కి గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. అంతే కాకుండా ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో కూడా చోటు దక్కింది. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం తాజాగా కీరవాణికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

దీనిపై స్పందించిన కీరవాణి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాను. ''భారత ప్రభుత్వం పౌర పురస్కారంతో గౌరవించబడిన సందర్భంగా.. కవితాపు సీతన్న గారి నుండి కుప్పాల బుల్లిస్వామి నాయుడు గారి వరకు నా తల్లిదండ్రులకు, నా గురువులందరికీ గౌరవ వందనం'' అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన అందరూ కీరవాణికి కామెంట్ల రూపంలో అభినందనలు తెలియజేస్తున్నాను.


ఈ సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి సైతం దీనిపై ఓ పోస్ట్ రిలీజ్ చేశారు. ''అభిమానులలో చాలామంది భావించినట్లుగా, ఈ గుర్తింపు కొంత కాలం ఆలస్యం అయింది. కానీ, మీరు చెప్పినట్లుగా విశ్వాసం అనేది ఒకరి ప్రయత్నాలకు ప్రతిఫలం ఇచ్చే విచిత్రమైన మార్గం. నేను విశ్వంతో తిరిగి మాట్లాడగలిగితే, నేను చెబుతాను కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక ఇంకోటి ఇవ్వమని చెబుతాను.. చివరిగా.. 'నా పెద్దన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి. గర్వంగా ఉంది.'' అంటూ పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి : ఈ అవార్డు నీకెప్పుడో ద‌క్కాల్సింది: MM Keeravani కి పద్మశ్రీపై Rajamouli పోస్ట్!

Also Read....

ఈ అవార్డు నీకెప్పుడో ద‌క్కాల్సింది: కీర‌వాణికి పద్మశ్రీపై రాజ‌మౌళి పోస్ట్!

Advertisement

Next Story