Brahmamudi Today: రాజ్ ప్రేమ అంతా నటననే అని తెలుసుకున్న కావ్య

by Prasanna |   ( Updated:2023-10-13 07:37:54.0  )
Brahmamudi Today: రాజ్ ప్రేమ అంతా నటననే అని తెలుసుకున్న కావ్య
X

దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘నేను కూడా చాలా నమ్మకాలే పెట్టుకున్నాను’ అని కావ్య అంటుంది. ఇప్పుడు నీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేనంతగా నేనేం చేశానో చెప్పు అని రాజ్ అంటాడు. ఇప్పుడు కాదు ‘సమయం వచ్చినప్పుడు నేను చెబుతానులే’ అని కావ్య అంటుంది. ముందు విషయం ఏంటో తెలియాలి కదా.. అప్పుడు సమయం తీసుకో’ అని రాజ్ అంటాడు. మొక్కు తీర్చుకోవడానికే వెళ్లాను.. కానీ ఆ దేవుడు అంత త్వరగా నా కోరికను నెరవేరుస్తాడని నేను అనుకోలేదు’ అని కావ్య అంటుంది. ‘ఏంటో ఆ కోరికా?’ మాకు చెప్పవచ్చుగా .. అని రాజ్ అడగగా.. ఇంకేమి ఉంటుంది .. నా మొగుడికి నా మీద విపరీతమైన ప్రేమ పెరగాలనుకున్నాను.. మీ మనసులో ఎంత ప్రేమ ఉందో ఇందాక గుడిలో చూపించారు కదా?’ అని వెటకారంగా అంటుంది కావ్య. కావ్య మాటలకు రాజ్ కాస్త తడబడుతూ చూస్తాడు. కావ్య మాట్లాడుతూనే ఉంటుంది..‘నేను కనిపించకపోయే సరికి.. ఎంత కంగారు పడిపోయారో? కళ్లారా చూశాకా.. నా కడుపు నిండిపోయింది. ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న నా కళ్లు తెరుచుకున్నాయి’ అని కావ్య అంటుంది.

Advertisement

Next Story

Most Viewed