ఓవర్ అయితే చెప్పండి అంటున్న బ్యూటీ.. పసికూన కాదు కసికూన!

by sudharani |   ( Updated:2024-04-23 13:24:11.0  )
ఓవర్ అయితే చెప్పండి అంటున్న బ్యూటీ.. పసికూన కాదు కసికూన!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ గురించి తెలిసిందే. ‘గంగోత్రి’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తన అద్భుతమైన నటనతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న కావ్య.. ‘మసూద’ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. తర్వాత వచ్చిన ‘బలగం’ చిత్రంతో మరింత పాపులారిటీని, క్రేజ్‌ను దక్కించుకుని ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగింది. ఇక దీంతో వరుస సినిమాలతో దూసుకుపోతుంది అనుకుంటే.. ఇప్పటి వరకు కావ్య ఒక్క సినిమా కూడా అనౌన్స్ చెయ్యలేదు.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ప్రేక్షకులతో పంచుకుంటోంది. ఇంతకు మందు మీద కాస్త స్లిమ్ అయిన కావ్య.. తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈక్రమంలోనే తాజాగా ట్రెండీ డ్రెస్‌లో కనిపించి కనపించనట్లు అందాలు చూపిస్తూ ‘నొప్పికి విలువ ఉంటే.. అది ఓవర్ అయినప్పుడు నాకు చెప్పండి’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో ‘పసికూన కాదు కసికూన’ అని ‘హాట్ బ్యూటీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story