‘ఖైదీ 2’ మూవీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కార్తి..!

by Kavitha |   ( Updated:2024-03-04 07:52:02.0  )
‘ఖైదీ 2’ మూవీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కార్తి..!
X

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తి.. హీరోగా తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో తమిళ సినిమాల్లో నటించిన ‘యుగానికి ఒక్కడు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాడు.ఈ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో అప్పటి నుంచి దాదాపు ఆయన నటించిన ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేస్తూ వస్తున్నాడు. అలా తన సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఇకపోతే కార్తీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మూవీలో ‘ఖైదీ’ ఒకటి. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు లో కూడా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఓ కాలేజీ ఈవెంట్ లో పాల్గొన్న కార్తి ఈ ‘ఖైదీ సీక్వెల్’ గురించి క్రేజీ అప్డేట్‌ను ఇచ్చాడు.. ‘ ‘ఖైదీ 2’ మూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం మొదలు పెట్టబోతున్నాము’ అని తెలియజేశాడు. ఇలా తన మూవీ గురించి కార్తినే స్వయంగా అప్డేట్ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Read More..

అభిమానులను పిలిచి మరీ భోజనాలు పెట్టించిన స్టార్ హీరో సూర్య .. కారణం ఇదే

Advertisement

Next Story