అక్కతో రొమాన్స్ చేసినవాడితోనే నేనూ చేస్తున్నా.. స్టార్ హీరోయిన్

by Disha News Desk |
అక్కతో రొమాన్స్ చేసినవాడితోనే నేనూ చేస్తున్నా.. స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా : అక్షయ్ కుమార్, కరీనా కపూర్ పలు బాలీవుడ్ సినిమాల్లో జంటగా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరి మధ్య దాదాపు 13 ఏళ్ల ఏజ్ డిఫరెన్స్ ఉండగా.. అక్షయ్‌తో కరీనా సోదరి కరిష్మా కపూర్‌‌ కలిసి నటించినపుడు తాను చిన్నపిల్లగా సెట్స్‌కు వచ్చిన విషయాన్ని కరీనా గుర్తుచేసుకుంది. రీసెంట్‌గా ట్వీక్ ఇండియా ప్లాట్‌ఫామ్‌పై అక్షయ్ వైఫ్ ట్వింకిల్ ఖన్నాతో ఆమె చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్న కరీనా.. ఆన్‌స్క్రీన్‌పై తన అక్క కరిష్మాతో రొమాన్స్ చేసిన కోస్టార్స్‌తో అందరితో ఇప్పుడు తాను రొమాన్స్ చేయడం విచిత్రంగా ఉందని తెలిపింది.

ఇక అక్షయ్‌కు సంబంధించి మొదటి షాట్ చూసినపుడు తాను స్కూల్ యూనిఫాంలో ఉన్నట్లు చెప్పింది. అంతేకాదు ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన తన కంటే అద్భుతంగా ఉన్నాడని అభిప్రాయపడింది. అయితే ఈ విషయాన్ని అంగీకరించని ట్వింకిల్.. బహుషా ఇక్కడ పురుషులకే సుదీర్ఘ కెరీర్ ఉంటుందనేందుకు ఇదే ఉదాహరణ అని పేర్కొంది. కానీ కరీనా మాత్రం 'ఇప్పుడు మేము ఆ అభిప్రాయాన్ని తప్పని రుజువు చేస్తున్నాం' అని చెప్పింది. కెరీర్ ప్రారంభించి 20 ఏళ్లయినా కరీనా ఇప్పటికీ టాప్ ఫిమేల్ లీడ్‌గా కొనసాగడమే అందుకు నిదర్శనం.

Advertisement

Next Story