- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Kareena : 'ప్రెగ్నెన్సీ బైబిల్' పుస్తకం పై వివాదం.. హైకోర్టు నోటీసులకు స్పందించిన కరీనా..

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ 'ప్రెగ్నెన్సీ బైబిల్' పుస్తకం పై క్రిస్టోఫర్ ఆంథోనీ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ మణీందర్ సింగ్ భట్టి సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. పుస్తకం టైటిల్‌లో 'బైబిల్' అనే పదాన్ని ఉపయోగించడం వల్ల తన మత, క్రైస్తవ సమాజానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని ఆంథోనీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పుస్తక విక్రయాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ కరీనా పై సెక్షన్ 295, 96 కింద కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారం పై మధ్యప్రదేశ్ హైకోర్టు కరీనా కపూర్‌ను సమాధానాలు కోరింది. దీని పై ఆగస్టు 27న విచారణ జరిగింది.
ఈ పిటిషన్ పై స్పందించిన కరీనా కపూర్ హై కోర్టులో తన వాదనను వినిపించారు. తన పుస్తకంలో ఎవరి మత మనోభావాలను దెబ్బతీయడం కాదని ఆమె అన్నారు. గర్భధారణ అనుభవాలను పంచుకోవడం, మహిళలకు మార్గనిర్దేశం చేయడం మాత్రమే లక్ష్యం అన్నారు.
కరీనా తరఫు న్యాయవాది నిఖిల్ భట్ కూడా ఈ పుస్తకం టైటిల్‌ను కేవలం గర్భం దాల్చిన అనుభవాల పూర్తి డాక్యుమెంట్‌గా ఉన్న నేపథ్యంలోనే ఎంచుకున్నట్లు తెలిపారు. అంతే కాకుండా పాపులారిటీ కోసం హైకోర్టులో ఇలాంటి పిటిషన్ వేశారని కరీనా కపూర్ తరపున న్యాయవాది చెప్పుకొచ్చారు.
తదుపరి విచారణ ఎప్పుడు..
ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు తదుపరి విచారణ తేదీని సెప్టెంబర్ 10కి నిర్ణయించింది. పిటిషనర్ అభ్యంతరాలను తీవ్రంగా పరిగణించాలని, అదే సమయంలో కరీనా కపూర్ హక్కులను కూడా గౌరవించాలని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో అన్ని పక్షాలకు తగిన అవకాశం కల్పిస్తామని కూడా కోర్టు పేర్కొంది. కరీనా 'ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పుస్తకం తన మాతృత్వ అనుభవాల ఆధారంగా రూపొందించారని చెప్పకొచ్చారు. ఈ వివాదం నేపథ్యంలో కోర్టు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
కరీనా కపూర్ తన పుస్తకాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు..
కరీనా కపూర్ తన చిన్న కొడుకు జహంగీర్ అలీ ఖాన్ పుట్టిన తర్వాత 2021 సంవత్సరంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కరీనా కపూర్ కూడా తన పుస్తకం అమ్మకాలను నిషేధించరాదని కోర్టులో డిమాండ్ చేశారు. ఈ పుస్తకం తనకు మూడో సంతానం లాంటిదని అన్నారు.
కరీనా వృత్తి జీవితాన్ని పరిశీలిస్తే ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన 'ది క్రూ' చిత్రంలో కరీనా చివరిసారిగా కనిపించారు. ఈ సినిమాలో ఆమెతో పాటు టబు, కృతి సనన్ కూడా కనిపించారు. ఈ చిత్రానికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు కరీనా మరికొద్ది నెలల్లో మరోసారి తెరపై కనిపించబోతోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో రోహిత్ శెట్టి 'సింగమ్' ఫ్రాంచైజీ మూడవ విడత 'సింగమ్ ఎగైన్'ని తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో కరీనా కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.