ప్రియాంకతో గొడవకు దిగిన కరీన.. వార్తలు వైరల్

by Anjali |   ( Updated:2023-10-15 12:42:23.0  )
ప్రియాంకతో గొడవకు దిగిన కరీన.. వార్తలు వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బెబో కరీనా కపూర్.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రాతో విబేధాలపై స్పందించింది. తమ మధ్య క్యాట్‌ఫైట్స్ ఉన్నాయన్న రూమర్స్‌ను ఖండించింది. యంగ్ ఏజ్‌లో తాను ఫులిష్ థింగ్స్ చేసిన మాట వాస్తవమే కానీ ఇలాంటి గొడవలు మాత్రం లేవని చెప్పింది. అయితే అలా స్టుపిడ్‌గా, చిల్లింగ్‌గా ఉండటం వల్లే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానేమో అని నవ్వేసింది. ప్రస్తుతం తాను ఇద్దరు పిల్లలకు తల్లిగా, భార్యగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని.. చాలా మెచ్యూర్‌ పర్సన్‌గా మారిపోయానని తెలిపింది. కాగా 2000 సంవత్సరం టైమ్‌లో కరీన, ప్రియాంక మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం ఉందని వార్తలు ప్రసారమయ్యాయి.

Advertisement

Next Story