సల్మాన్‌ఖాన్ రియల్ క్యారెక్టర్‌పై కరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అలాంటివాడే అంటూ

by Prasanna |   ( Updated:2023-10-18 07:29:26.0  )
సల్మాన్‌ఖాన్ రియల్ క్యారెక్టర్‌పై కరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అలాంటివాడే అంటూ
X

దిశ, సినిమా: స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రియల్ క్యారెక్టర్‌ అండ్ వర్క్ కమిట్‌మెంట్‌పై బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ప్రసంశలు కురిపించాడు. ఈ మేరకు షారుఖ్ ఖాన్, కాజోల్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో కరణ్ తెరకెక్కించిన క్లాసిక్ మూవీ ‘కుచ్ కుచ్ హోతా హై’ విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్.. మూవీలో గెస్ట్ రోల్ పోషించడానికి ఎవరూ ముందుకు రాలేదన్నాడు. ‘సినిమాలో సల్మాన్ ఎంపిక ఒక ఆసక్తికరమైన అంశం. ‘అమన్’ క్యారెక్టర్ చేయమని చాలామందిని అడిగాను. స్టోరీ సగం కూడా వినకుండానే రిజెక్ట్ చేశారు. దీంతో చివరగా సల్మాన్‌ను కలిశాను. విషయం చెప్పగానే ఆయన ఒక మాట అన్నాడు. ‘ఆత్మవిశ్వాసం ఉన్న నటుడే ఇలాంటి పాత్రలో నటించగలడు. ఇది నేను చేస్తున్నా’ అని డైరెక్ట్ ఒప్పేసుకున్నాడు. అప్పటినుంచి సల్మాన్ అంటే నాకు చెప్పలేనంత ప్రేమ, గౌరవం’ అంటూ తెగ పొగిడేశాడు కరణ్.

Advertisement

Next Story