త్వరలో సెట్స్ పైకి Kantara-2.. స్పష్టం చేసిన హోంబలే ప్రొడక్షన్స్

by Mahesh |   ( Updated:2022-12-22 05:35:40.0  )
త్వరలో సెట్స్ పైకి Kantara-2.. స్పష్టం చేసిన హోంబలే ప్రొడక్షన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 ఆస్కార్ కు కాంతారా నామినేషన్లు దాకలు చేసింది. ఈ క్రమంలో ఓ జాతీయ మీడియాతో కాంతారా మూవీ తీసిన హోంబలే ప్రొడక్షన్స్ ప్రోడ్యూసర్స్ మాట్లాడుతూ.. త్వరలో కాంతారా-2 ను చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇది ప్రాంఛైజీ లా సీక్వెల్, ప్రీక్వెల్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదని తెలిపారు. కాంతారా స్టోరీ, దర్శకుడైన రిషబ్ శెట్టి ప్రస్తుతం అందుబాటులో లేడని.. అతని విదేశీ పర్యటనలో ఉన్నాడని అన్నారు. కాగా అతను భారత్ రాగానే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే రిషబ్ శెట్టి ఓకే అంటే కొద్ది నెలల గడువులోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని హోంబలే ప్రొడక్షన్స్ వారు తెలిపారు.

Also Read..

2023 ఆస్కార్ రేసులో Kantara .. RRR గట్టి పోటీ తప్పేట్లు లేదుగా..!

Advertisement

Next Story