- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్ ఇండస్ట్రీని భ్రష్టు పట్టిస్తున్నారు.. సౌత్ హీరోలపై నటి షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. తాజాగా సౌత్ ఇండియన్ స్టార్స్ అల్లు అర్జున్, యశ్‌లను ప్రస్తావిస్తూ ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. సినీ ప్రముఖులు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల విడుదలైన 'పుష్ప,' అప్పట్లో వచ్చిన 'కేజీఎఫ్' సినిమాలు సౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీలో కూడా బాక్సాఫీసు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.
ఈ విషయాలను ప్రస్తావిస్తూ 'సౌత్ కంటెంట్‌తో పాటు సూపర్ స్టార్స్‌లో ఈ రేంజ్ ఆవేశం ఉండడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. ఈ స్టార్ హీరోలు భారతీయ సంస్కృతిలో బలంగా పాతుకుపోయారు. వాళ్లు తమ కుటుంబాలను అమితంగా ప్రేమిస్తారు. సంబంధాల విషయంలో వెస్టర్న్ కల్చర్‌ను ఫాలో కాకుండా బంధాలను నిలుపుకుంటారు. వారి వృత్తి నైపుణ్యం, అభిరుచి అసమానమైనది' అంటూ పొగిడేసిన నటి.. చివరగా 'బాలీవుడ్ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించేందుకు ఇలాంటి వారిని అనుమతించకూడదు' అని హిందీ సినీపరిశ్రమపై సెటైర్ వేసింది.