Emergency teaser :ఆకట్టుకుంటున్న కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ టీజర్..

by Hamsa |   ( Updated:2023-06-24 11:50:06.0  )
Emergency teaser :ఆకట్టుకుంటున్న కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ టీజర్..
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇందులో కంగనా ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన పరిణామాలను హైలెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా, ఎమర్జెన్సీ టీజర్‌ను కంగనా తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25, 1975 తేదీతో టీజర్ ప్రారంభమవుతుంది. ప్రతిపక్షలు అరెస్ట్, మీడియా ప్రసారాలు ఆగిపోయాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. పోలీసులు అణచివేత విధానాన్ని అవలంబిస్తున్నారు బుల్లెట్లు కాల్చారు. అప్పుడు ఇందిరా గాంధీ.. ఈజ్ ఇండియా ఇందిర అనే శక్తివంతమైన స్వరం వినిపిస్తుంది. ఇలా సాగిన టీజర్‌ను కంగనా పోస్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్’ను జతచేసింది. ‘‘రక్షకుడా లేక నియత? మన దేశ లీడర్ తన ప్రజలపై యుద్ధం ప్రకటించిన రోజు చరిత్రలోనే చీకటి రోజుగా ఉంది’’ అంటూ రాసుకొచ్చింది. కాగా ఈ సినిమా నవంబర్ 24న థియేటర్స్‌లో విడుదల కానుంది.

Also Read: నిఖిల్ ‘స్పై’ మూవీ రన్ టైమ్.. ఎంతంటే?

Advertisement

Next Story