ఈ అన్యాయంపై మాట్లాడిన మొదటి వ్యక్తిని నేనే.. కంగన

by Dishaweb |
ఈ అన్యాయంపై మాట్లాడిన మొదటి వ్యక్తిని నేనే.. కంగన
X

దిశ, సినిమా: సిని పరిశ్రమలో మహిళల రెమ్యూనరేషన్ ఇష్యూపై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ప్రియాంక చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి ప్రియాంక ధైర్యంగా మాట్లాడిందంటూ పొగిడేసింది. ‘పరిశ్రమలో పారితోషికం గురించి మాట్లాడిన ఫస్ట్ పర్సన్ నేనే. అలా మాట్లాడినందుకు నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నా. దీంతో కొందరు నిర్మాతలు నేను చేయాల్సిన క్యారెక్టర్లను వేరే వాళ్లతో ఫ్రీగా చేయించుకున్నారు. అలాగే ఇతరులకు దక్కాల్సిన పాత్రల్లో ఉచితంగా నటించేందుకు ఏ1గా చెప్పుకునే నటీమణులు కొంతమంది కూడా రెడీగా ఉంటారు. ఇప్పటి వరకూ నేను మాత్రమే హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా. మిగతావాళ్లు ఎందుకు వెనకబడుతున్నారో వాళ్లను వాళ్లే ప్రశ్నించుకోవాలి’ అంటూ పలు విషయాలు ప్రస్తావించింది.

Advertisement

Next Story

Most Viewed