Kangana Ranaut: నెట్టింట దుమారం రేపుతోన్న MP కంగనా వివాదాస్పద ట్వీట్..!

by Anjali |
Kangana Ranaut: నెట్టింట దుమారం రేపుతోన్న MP కంగనా వివాదాస్పద ట్వీట్..!
X

దిశ, సినిమా: వివాదాలకు కేరాఫ్ అడ్రాస్‌‌గా నిలిచే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ఈ భామ తన ప్రత్యర్థి విక్రమాదిత్యపై గెలుపొందింది. ఆయనపై 74755 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమారుడైన విక్రమాదిత్య సింగ్‌ను చిత్తు చేసింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.

ఇకపోతే సునందా రాయ్ అనే వ్యక్తి "ఇదేం సెలబ్రేషన్స్? లిబరల్స్ అండ్ ఇస్లామిస్ట్స్.. ప్రపంచంలో అత్యంత శాంతియుత సెలబ్రేషన్ కదా’’ అని రాసుకొచ్చి ఓ వీడియో షేర్ చేశాడు. దీనికి నేడు (జులై 29) కంగనా ఆ ట్వీట్‌కు రీట్వీట్ చేస్తూ.. ‘‘ఈ ఆచారం చాలా డిఫరెంట్ ఉంది. చూడానికి ఎంతో భయంకరంగా ఉంది. ఇలాంటి ప్రపంచంలో మనుగడ సాగించాలంటే హిందూ మగాళ్లు కూడా ఏదో ఒక రకమైన యుద్ధ విద్యలో శిక్షణ పొందాల్సిన అవసరం ఉంది?

ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే మీ రక్తాన్ని కూడా కాస్త మరగించుకోవడంలో తప్పేం లేదు. నేను చెప్పింది కాదంటారా? ’ అంటూ ఫైర్ బ్రాండ్ కంగనా క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. కంగనా ట్వీట్ పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed