సూర్యకు రోల్‌వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్

by GSrikanth |
సూర్యకు రోల్‌వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్
X

దిశ, సినిమా : ఇటీవల లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ విజయాన్ని అందించిన డైరెక్టర్ కనకరాజ్‌కు కమల్ ఏకంగా లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సూర్య రోలెక్స్ పేరుతో ఓ చిన్న గెస్ట్ రోల్ చేసి సినిమాను మరింత హైప్‌లోకి తీసుకెళ్లారు. అయితే నిజానికి ఈ రోలెక్స్ రోల్ చేసినందుకు సూర్య ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. ఇకపోతే విశ్వనటుడు కమల్.. సూర్యకు ఖరీదైన రోలెక్స్ వాచ్‌ను స్వయంగా చేతికి బహుమతిగా అలంకరించారు. ఇక ఈ బహుమతిపై స్పందించిన సూర్య..'ఈ క్షణాలు జీవితాన్ని అందంగా మార్చేశాయి. థ్యాంక్యూ అన్న' అంటూ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story