- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నకిలీ ప్రపంచంలో జీవిస్తున్నామంటూ మెగా అల్లుడు పోస్ట్.. శ్రీజ గురించేనా?

దిశ, వెబ్ డెస్క్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఫస్ట్ ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. వారికి ఓ పాప పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత చిరంజీవి శ్రీజను చేరదీసి కల్యాణ్ దేవ్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే వీరిద్దరికి కూడా ఓ పాప పుట్టింది. అయితే శ్రీజ- కల్యాణ్ దేవ్ కూడా విడాకులు తీసుకుని విడిపోతున్నారంటూ గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. ఇటీవల మెగా అల్లుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా, తన ఇన్‌స్టాస్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ ఈ నకిలీ ప్రపంచంలో జీవిస్తున్నాము. నకిలీ తనం ఎవరినీ ఆశ్చర్య పరచదు’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు శ్రీజ మోసం చేయడం వల్ల అలా పెట్టాడని అనుకుంటున్నారు.