ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. కల్కి ట్రైలర్ డేట్ వచ్చేసింది..

by Sujitha Rachapalli |
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. కల్కి ట్రైలర్ డేట్ వచ్చేసింది..
X

దిశ, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రాబోతున్న 'Kalki 2898 AD' ప్రమోషన్స్ ఇంటర్నేషనల్ లెవల్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే మెయిన్ లిడ్ స్టార్స్ పాత్రలను రివిల్ చేసిన మూవీ యూనిట్.. బుజ్జి అనే కారును స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ అప్ డేట్ తో వరల్డ్ సినిమా అటెన్షన్ క్యాచ్ చేసింది. బుజ్జి, భైరవ కాంబినేషన్ లో యానిమేషన్ వీడియో రిలీజ్ చేసి మరింత హైప్ పెంచింది. ఎలాన్ మస్క్ కు ట్వీట్, సెలబ్రిటీ కిడ్స్ కు గిప్ట్స్ ఇస్తూ ప్రమోషన్స్ జోరుగా చేస్తుంది.

ఈ క్రమంలో మరో అప్ డేట్ తో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది మూవీ టీమ్. జూన్ 10న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ' Everything Is About To Change ' అంటూ ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేయలేకపోతున్నామని అంటున్నారు. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.



Advertisement

Next Story

Most Viewed