- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంపర్ ఆఫర్ ప్రకటించిన కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: డైరెక్టర్ నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలాగే ఈ మూవీ కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టి మేకర్స్‌కు లాభాలను అందించింది. అయితే ఇందులో ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్స్ నటించగా.. దీనిని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించాడు. ఇక కల్కి వచ్చి దాదాపు రెండు నెలలు పూర్తి కావొస్తున్నప్పటికీ ఓటీటీలోకి మాత్రం రాలేదు.
దీంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల్లో ఆతృత పెరిగిపోయింది. అయితే కల్కి సీక్వెల్ కూడా ఉన్నట్లు ఇప్పటికే నాగ్ అశ్విన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ 2025 లో విడుదల చేయబోతున్నట్లు కూడా తెలిపారు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు మొదలు కాబోతుందనేది ఇందులో ఎవరు నటిస్తున్నారో తెలియజేయలేదు. ఈ క్రమంలో.. తాజాగా, నాగ్ అశ్విన్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
అగ్ర నిర్మాణ సంస్థ ఏవీఎమ్ స్టూడియోస్‌పై తెరకెక్కనున్న కొత్త సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని అధికారిక ప్రకటనను విడుదల చేశాడు. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా అయోమయంలో పడిపోయారు. నాగ అశ్విన్ కల్కి పార్ట్-2 గురించి చెబుతారనుకుంటే.. అది వదిలేసి కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నాడా? అని అంటున్నారు. అలాగే కొందరు మాకు ఇంట్రెస్ట్ ఉందని కామెంట్లు పెడుతున్నారు.
- Tags
- Nag Ashwin