మనిషి పుట్టడంతోనే జీవితం అనే శ‌త్రువును వెంటేసుకుని పుడ‌తాడు.. ఆసక్తికరంగా ‘కలి’ ట్రైలర్

by Hamsa |
మనిషి పుట్టడంతోనే జీవితం అనే శ‌త్రువును వెంటేసుకుని పుడ‌తాడు.. ఆసక్తికరంగా ‘కలి’ ట్రైలర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు ప్రిన్స్ మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. అలాగే పలు మూవీస్‌లో హీరోగా కూడా చేశాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రిన్స్, నరేష్ అగస్త్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘కలి’. ఈ సినిమాను శివ శేషు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రాఘవేంద్ర రావు నిర్మిస్తున్నారు. అయితే సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘కలి’ అప్డేట్స్‌ను విడుదల చేస్తున్నారు. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలై సినిమాపై హైప్ పెంచుతోంది. మరీ ముఖ్యంగా ‘‘మనిషి పుట్టడం తోనే జీవితం అనే శత్రువును వెంటేసుకుని పుడతాడు. దాని మీద గెలిచిన వాడే గొప్పవాడు అవుతాడు. ఓడినోడు మధ్యలోనే అని ప్రిన్స్ చెప్తుండగా.. నరేష్ వచ్చి ఓ గేమ్ ఆడుదాం’’ అనే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Next Story

Most Viewed